• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం

KRNL: సీతారాముల కళ్యాణ మహోత్సవం స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి కర్నూలు జిల్లాలో ఘనంగా జరిగాయి. సీతారాముల కళ్యాణ భక్తాదులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమములో పాల్గొని మంగళ హారతి, తీర్ధప్రసాదములు స్వీకరించి, స్వామి వార్ల కృపకు పాత్రులయారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

March 27, 2026 / 06:30 PM IST

శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్సీ

TPT: రేణిగుంట మండలం గుత్తివారి పల్లి గ్రామంలో వెలసిన శ్రీ కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ, రష్ హాస్పిటల్ అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పాల్గొని సీతారాములును దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

March 27, 2026 / 06:27 PM IST

‘సకాలంలో ప్రాపర్టీ టాక్స్ చెల్లించండి’

ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో శుక్రవారం చేస్తున్న పెండింగ్‌లో ఉన్న ఇంటి ప్రాపర్టీ టాక్స్ వసూలు ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పరిశీలించారు.ఇంటింటికి తిరుగుతూ పెండింగ్‌లో ఉన్న ప్రాపర్టీ టాక్స్ వెంటనే చెల్లించాలని ప్రజలకు సూచించారు. ఆమె మాట్లాడుతూ.. సకాలంలో ప్రాపర్టీ టాక్స్ చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని సూచించారు.

March 27, 2026 / 06:24 PM IST

మైలవరం రిజర్వాయర్‌కు 2500 క్యూసెక్కుల నీరు

KDP: గండికోట జలాశయం నుంచి మైలవరం రిజర్వాయర్‌లోకి శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు నీరు విడుదల చేసినట్లు ఈఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గండికోట జలాశయం నుంచి ఒక గేటు ఎత్తి 2500 క్యూసెక్కుల నీరు మైలవరం రిజర్వాయర్‌కు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం గండికోట జలాశయంలో 24.60 టీఎంసీల నీరు నిలువ ఉన్నట్లు ఈఈ వివరించారు.

March 27, 2026 / 06:24 PM IST

వార్డెన్ బాధ్యతలకు టీచర్ల నిరాకరణ

ASR: మెగా డీఎస్సీ ద్వారా నియమితులైన కొందరు ఉపాధ్యాయులకు వార్డెన్ బాధ్యతలు అప్పగించే ప్రభుత్వ నిర్ణయాన్ని తాము అంగీకరించలేమని పలువురు టీచర్లు తెలిపారు. శుక్రవారం టీడీపీ పాడేరు ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నిర్వహించిన ప్రజా దర్బార్‌లో వినతి పత్రం సమర్పించారు. తాము టీచర్ పోస్టులకే ఎంపికయ్యామని, వార్డెన్‌గా బాధ్యతలు తీసుకోలేమని పేర్కొన్నారు.

March 27, 2026 / 06:20 PM IST

యనకండ్లలో సీతారాముల కళ్యాణం

NDL: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా యనకండ్లలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. వేలాది మంది భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. మంత్రి ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ.. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

March 27, 2026 / 06:15 PM IST

ప్రత్యేక పూజలో పాల్గొన్న న్యాయమూర్తి

పార్వతీపురం పట్టణంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో నిర్వహించిన శ్రీ రామ నవమి వేడుకల్లో జిల్లా రెండోవ అదనపు న్యాయమూర్తి ఎస్. దామోదరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ముందుగా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అర్చకులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.

March 27, 2026 / 06:13 PM IST

సింహాచలంలో ఎస్టీ కమిషన్ ఛైర్మన్

VSP: జిల్లా పర్యటనలో భాగంగా ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి సింహాచలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు.

March 27, 2026 / 06:13 PM IST

రోణంకి అప్పలస్వామి విగ్రహం ఆవిష్కరణ

SKLM: ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం రోణంకి అప్పలస్వామి విగ్రహాన్ని వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య డాక్టర్ కె ఆర్. రజిని ఆవిష్కరించారు. పలు భాషల్లో ఉపన్యాశునిగా, అనువాదుకునిగా, రచయితగా పేరుగాంచిన అప్పలస్వామి “నడయాడే బాషా విశ్వవిద్యాలయం” అని పేర్కొన్నారు. సాహితి, భాషా రంగాలకు చేసిన సేవలు వెలకట్టలేనవని ఆమె తెలియజేశారు.

March 27, 2026 / 06:11 PM IST

ద్రవ జీవామృతంపై అవగాహన

VZM: ద్రవ జీవామృతం ద్వారా భూముల్లోని నిద్రావస్థల్లో ఉన్న సూక్ష్మజీవులను ఉత్తేజపరచవచ్చని ప్రకృతి వ్యవసాయ శాఖ ఎఫ్ఎమ్‌టీ కళావతి తెలిపారు. శుక్రవారం మెరకముడిదాం గ్రామంలో గణేష్ రాజు వ్యవసాయ క్షేత్రంలో ద్రవ జీవామృతం తయారు చేశారు. దీని ద్వారా భూమి ఆరోగ్యవంతంగా ఉండడంతో పాటు పంట కూడా ఆరోగ్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు.

March 27, 2026 / 06:11 PM IST

శ్రీ రామనవమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

కోనసీమ: కొత్తపేట మండలం వాడపాలెం రామాలయంలో శుక్రవారం జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు పానకం పంపిణీ చేశారు

March 27, 2026 / 06:04 PM IST

‘ఎంపీ కేశినేని చిన్నిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’

NTR: విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో టీఎన్ టీయుసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ కేసినేని చిన్నిపై సాక్షి పేపర్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ అభివృద్ధి కోసం ఎంపీ కేసినేని చిన్ని నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఆయనపై బురద జల్లుతున్నారని తెలిపారు.

March 27, 2026 / 06:00 PM IST

మంత్రాలయంలో రేపు జాబ్ మేళా

KRNL: మంత్రాలయం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్ శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. వివిధ కంపెనీల్లో 690 ఖాళీలు ఉన్నాయన్నారు. 10వ తరగతి నుంచి ఫార్మసీ వరకు చదివిన 18–40 ఏళ్ల వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని చెప్పారు.

March 27, 2026 / 06:00 PM IST

టీడీపీ ఇంఛార్జ్ కుర్షిద్ బేగం మృతి

కృష్ణా: మచిలీపట్నం జిల్లా పరిషత్ కన్వెన్షన్‌లో ఇటీవల జరిగిన ఇఫ్తార్ విందులో పెడన 15వ వార్డు టీడీపీ ఇంఛార్జ్ కుర్షిద్ బేగం హాజరయ్యారు. అనంతరం తిరిగి ప్రయాణం అయ్యే సమయంలో రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్ర గాయాలు పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. శుక్రవారం ఆమె మృతి చెందారు. ఆమె మరణం పట్ల ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

March 27, 2026 / 06:00 PM IST

హిందూపురం నుంచి గుంటూరు చేరుకున్న సైకిల్ యాత్ర

GNTR: హిందూపురం నుంచి రాజధాని అమరావతి వరకు “ఒక్క అడుగు బాధ్యత వైపు” అనే లక్ష్యంతో మంజునాథ్ చేపట్టిన సైకిల్ యాత్ర శుక్రవారం గుంటూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా సైకిల్ యాత్రికుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బాధ్యతను గుర్తు చేస్తూ మంజునాథ్ చేపట్టిన ఈ యాత్ర అభినందనీయం అని అన్నారు.

March 27, 2026 / 06:00 PM IST