కోనసీమ: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయ నిత్య అన్నదాన పథకానికి శనివారం పీ. గన్నవరం మండలం ముంగండ వాస్తవ్యులు సుసర్ల వెంకట ఉమామహేశ్వర, యశస్వి వారి కుటుంబ సభ్యులు రూ. 1,01,116 విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి శేష వస్త్రములతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.