• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నందీశ్వర ఆలయ హుండీ ఆదాయం ఎంత అంటే.?

NDL: బండి ఆత్మకూరు మండలం కడమలకాల్వ శ్రీ శివ నందీశ్వర స్వామి దేవస్థానంలో శాశ్వత హుండీని శనివారం లెక్కించారు. నంద్యాల డివిజన్ తనిఖీ అధికారి పీ. హరిచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగింది. ఏడాది కాలానికి రూ. 39,288 ఆదాయం వచ్చినట్లు ఈవో నాగప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ మద్దిగారి పుష్పరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.

March 28, 2026 / 04:03 PM IST

మర్రిపూడి మండలంలో పొగాకు అక్రమ కొనుగోలు

ప్రకాశం: మర్రిపూడి మండలంలో దళారులు అక్రమంగా పొగాకు కొనుగోలు చేస్తూ రాత్రికి రాత్రే తరలిస్తున్నారు. వేలం కేంద్రాల్లో క్వింటా ధర రూ. 25,000 పలుకుతుండగా, దళారులు అమాయక రైతులను బురిడీ కొట్టించి కేవలం రూ. 21,000 కే కొంటున్నారు. నిబంధనల ప్రకారం పొగాకును కేవలం వేలం కేంద్రాల్లోనే విక్రయించాలి.

March 28, 2026 / 04:00 PM IST

ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపివేత

PLD: చిలకలూరిపేటలో విద్యుత్ బకాయిల వసూలుపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రూ. 1 లక్ష, MRO ఆఫీస్ రూ. 36 లక్షలు, మున్సిపల్ వాటర్ వర్క్స్ రూ. 2.80 కోట్లు బకాయిలు ఉన్నందుకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు అధికారి అశోక్ తెలిపారు.

March 28, 2026 / 04:00 PM IST

రాజమండ్రిలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు

EG: రేపు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉదయం 9:00 గంటలకు సిటీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం తిలక్ రోడ్ స్థూపం వద్ద జెండా ఆవిష్కరణ ఉండనుంది. నాయకులు, కార్యకర్తలు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఓ ప్రకటనలో తెలిపారు.

March 28, 2026 / 04:00 PM IST

‘జీరో వేస్ట్’ లక్ష్యం: సూపరింటెండెంట్ మల్లీశ్వరి

ATP: జిల్లాలో సర్వజన ఆసుపత్రిలో ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి వ్యర్థాల నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి మాట్లాడుతూ.. ఆసుపత్రిలో అంతిమ వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడమే ‘జీరో వేస్ట్’ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం సిబ్బందితో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.

March 28, 2026 / 03:59 PM IST

తోటల పరిరక్షణపై రైతులకు అవగాహన

ELR: నూజివీడు మండలం తూర్పు దిగువల్లి గ్రామంలో ‘పండ్ల తోటలలో పండు ఈగ పర్యవేక్షణ, యాజమాన్య పద్ధతులు’ అంశంపై రైతులకు శనివారం అవగాహన ఏర్పాటు చేశారు. మామిడి పరిశోధనా శాస్త్రవేత్త రాధారాణి మాట్లాడుతూ.. మామిడి ఎగుమతులకు ఫ్రూట్ కవర్స్ తప్పనిసరిగా వినియోగించాలన్నారు. కవర్స్ వినియోగంతో తెగుళ్ల బారీ నుంచి రక్షణ ఉంటుందని తెలిపారు.

March 28, 2026 / 03:58 PM IST

పోలమాంబ అమ్మవారి జాతరకు సర్వం సిద్ధం

VSP: విశాఖ పెదవాల్తేరులోని శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయం జాతర ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ ఈవో టీ.రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ నెల 30న తొలేళ్ల ఉత్సవం, 31న అనుపు, ఏప్రిల్ 7న మారువారం, 11న అన్నదానం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఉత్సవానికి సుమారు 70 వేల మంది భక్తులు హాజరవుతారని అంచనా.

March 28, 2026 / 03:50 PM IST

మైదుకూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు పూర్తీ

KDP: మైదుకూరు కోర్టులో బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షుడిగా తిప్పన పట్టాభిరాముడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా భూమిరెడ్డి శ్రీనివాసులు, జాయింట్ సెక్రెటరీగా యశ్వంత్ రాయలు, లేడీస్ సెక్రెటరీగా బీ. హేమావతి ఎన్నికైనట్లు అసోసియేషన్ కమిటీ వెల్లడించింది. ఏకగ్రీవంగా ఎన్నిక చేయడంలో సహకరించిన న్యాయవాదులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

March 28, 2026 / 03:50 PM IST

‘రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం’

KRNL: రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎంపీ నాగరాజు అన్నారు. శనివారం కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలను ఆయన ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని ఎంపీ ఆరోపించారు. రైతుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

March 28, 2026 / 03:48 PM IST

ఆశా నోడల్ అధికారులతో సమావేశం

PPM: మాతా-శిశు ఆరోగ్య శ్రేయస్సే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా. ఎస్.భాస్కరరావు సూచించారు. గర్భిణీ, బాలింతలు, శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించి మరణాలు నివారించాలని అన్నారు. ఆశా నోడల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో గర్భిణీల నమోదు, టీకాల పురోగతి, హెచ్‌పీవీ వ్యాక్సిన్ 100% అమలు పై దృష్టి సారించాలని ఆదేశించారు.

March 28, 2026 / 03:47 PM IST

‘కాలుష్యంపై కలెక్టరేట్ వద్ద ధర్నా’

AKP: బొగ్గు లారీల కాలుష్యంపై ఏప్రిల్ రెండవ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి తెలిపారు. ధర్నాపై శనివారం పరవాడలో ప్రచారం నిర్వహించారు. హిందూజా, ఎన్టీపీసీ లారీలు వెదజల్లుతున్న కాలుష్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. కాలుష్యం కారణంగా అనేకమంది రోగాలపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

March 28, 2026 / 03:46 PM IST

సర్పంచ్‌లను సత్కరించిన MPP హరిబాబు

W.G: ఉండి మండల పరిషత్ సమావేశ మందిరంలో మండలంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లను ఉండి MPP ఇందుకూరి హరిబాబు సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్‌ల సహకారం మరువలేనిది అన్నారు. ఉండి సర్పంచ్ కమతం సౌజన్య, చెరుకువాడ సర్పంచ్ కొండవీటి శివయ్య, వాండ్రం సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ, ఉణుదుర్రు సర్పంచ్ పిన్నంరాజు నాగలక్ష్మి తదితరులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో MRO నాగార్జున పాల్గొన్నారు.

March 28, 2026 / 03:44 PM IST

సీతానగరం ఎస్ఐగా వినయ ప్రతాప్

E.G: నూతన ఎస్ఐ వి. వినయప్రతాప్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ సీసీఎస్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన, ఎస్ఐ రాంకుమార్ నుంచి చార్జ్ తీసుకున్నారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నేరాల నియంత్రణకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. 

March 28, 2026 / 03:43 PM IST

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: కలెక్టర్

సత్యసాయి: హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో శనివారం జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా పర్యటించారు. ఎం.జి.ఎం మైదానంలో పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లు పంపిణీ చేసి, కొత్త గార్బేజ్ ఈ-ఆటోలను ప్రారంభించారు. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న వ్యాపారులపై జరిమానా విధించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.

March 28, 2026 / 03:42 PM IST

మృతుడి కుటుంబానికి పరిటాల శ్రీరామ్ పరామర్శ

ATP: ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ అక్కులప్ప ఆత్మహత్యకు పాల్పడటం విషాదాన్ని నింపింది. అనంతపురం సర్వజన వైద్యశాల మార్చురీలో ఉన్న ఆయన భౌతికకాయాన్ని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ సందర్శించారు. అక్కులప్ప పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

March 28, 2026 / 03:41 PM IST