కృష్ణా: పమిడిముక్కల మండలం గోపవానిపాలెంలో మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రజలకు చేసిన సేవలు, తెలుగు ప్రజల పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమను ఆమె స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
GNTR: విద్యార్థులు మంచి విలువలు నేర్చుకుని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సూచించారు. “జీరో వేస్ట్ ఇన్స్టిట్యూట్” కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. వ్యర్థాల నిర్వహణ, పచ్చదనం, నీటి సంరక్షణలో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో యువత పాత్ర కీలకమని తెలిపారు.
KDP: టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి జబీవుల్లా పిలుపునిచ్చారు. కడపలో రేపు జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ స్థాపకుడు ఎన్టీ రామారావు ఆశయాలను స్మరించుకుంటూ వేడుకలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాలు ఘనంగా చేపట్టాలని పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం రూరల్ మండలం చెట్టువానిపేట గ్రామంలో శ్రీ అసిరితల్లి గ్రామదేవత దారు(చెక్క)విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులకు హాజరూ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.
ELR: ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం ద్వారా జిల్లాలోని యువతీ, యువకులను ఇంటర్న్ షిప్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి జితేంద్ర శనివారం తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ అర్హత కలిగి వార్షిక ఆదాయం రూ.12 లక్షల లోపు ఉండి 18-25 ఏళ్లున్న వారు ఈ ప్రోగ్రాంకు అర్హులని తెలిపారు.
W.G: ఉండి మండలం పెదపుల్లేరు గ్రామంలో కాస్మో పొలిటన్ క్లబ్ వ్యవస్థాపకులు, కీర్తిశేషులు కలిదిండి రామచంద్ర రాజు (రామం) విగ్రహావిష్కరణ శనివారం ఘనంగా జరిగింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాజీ DCCB ఛైర్మన్ కరటం రాంబాబు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. రామం చేసిన సేవలను స్మరించుకోవాలని అన్నారు.
TPT: టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రెండు సంస్థలు కలిపి రూ.20 లక్షలకు పైగా విరాళం అందించాయి. చందన బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.10,01,116 విరాళంగా అందించగా, బెంగళూరుకు చెందిన క్రెడ్వెస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.10,00,116 విరాళం సమర్పించింది.
KDP: విశ్వనాధపురం రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ శనివారం భిక్షాటన నిర్వహించారు. వెంటనే పనులు ప్రారంభించకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని కమిటీ హెచ్చరించింది. రెండేళ్లుగా పనులు నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
NTR: నందిగామ మండలం పల్లగిరి గ్రామంలో శనివారం స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమం కింద “థీమ్ జీరో వేస్ట్” అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో ఆర్.వి.యస్. ప్రసాదరావు గ్రామ ప్రజలకు చెత్త సేకరణ, పరిశుభ్రత ప్రాముఖ్యత వివరించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ అభివృద్ధి అధికారి, డిప్యూటీ ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
KRNL: ఆదోని సాయినగర్ కాలనీకి చెందిన వీరేష్ మున్సిపల్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పన్నులు పెంచుతున్నా కాలనీలో విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు అధ్వాన్నంగా ఉన్నాయని ఇవాళ విమర్శించారు. సమస్యలపై పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరారు.
AKP: అమరావతి రాజధాని కోసం మహిళలు 1,631 రోజులు సుదీర్ఘకాలం పోరాటం చేశారని హోం మంత్రి అనిత గుర్తు చేశారు. అమరావతి రాజధానిపై తీర్మానం కోసం సమావేశమైన శాసనసభలో ఆమె మాట్లాడుతూ.. అమరావతి రాజధానిపై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. అమరావతికి చట్టబద్ధత కల్పించుకునే అపూర్వ ఘట్టం ఆవిష్కృతం అయిందన్నారు. అమరావతి కోసం చేసిన త్యాగాలు, పోరాటాలను గుర్తు చేశారు.
PPM: వినియోగదారుల్లో చైతన్యం పెంపొందితేనే నాణ్యమైన జీవితం సాధ్యమవుతుందని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి అన్నారు. శనివారం గిరిమిత్ర భవనంలో మహిళా సాధికారత లక్ష్యంగా నిర్వహించిన ‘షైన్’ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసే సమయంలో కేవలం ధర, అందుబాటును మాత్రమే ఆధారంగా తీసుకోకుండా, వాటి నాణ్యత, బ్రాండ్, ప్రమాణాలను పరిశీలించాలన్నారు.
NLR: నగర పాలక సంస్థ పరిధిలో మొండి బకాయిలు ఉన్న వారు ప్రభుత్వం ప్రకటించిన 50% వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకోవాలని శనివారం కమిషనర్ వై.ఓ. నందన్ కోరారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి 4 రోజులు మాత్రమే గడువు ఉన్నందున కౌంటర్లు అందుబాటులో ఉంటాయన్నారు. నగర అభివృద్ధి కోసం పన్నులను సకాలంలో చెల్లించి సహకరించాలని కమిషనర్ తెలియజేశారు.
E.G: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల నిడదవోలు పట్టణ బీజేపీ అధ్యక్షులు మోర్త ప్రమోద్ హర్షం వ్యక్తo చేశారు. నిడదవోలులో ఆయన శనివారం మాట్లడుతూ సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, ప్రజలపై భారం పడకూడదని నిర్ణయం తీసుకుందన్నారు.
SKLM: ఆమదాలవలస మండలం అక్కుల పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ మేరకు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల లభ్యత పై ఆయన సమీక్షించారు. వైద్యులు సమయపాలన పాటించాలని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డాక్టర్లు మీనా కుమారి, వసంత పాల్గొన్నారు.