ATP: తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని రాయదుర్గం పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణమూర్తి కోరారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రతి వార్డులో పార్టీ జెండాను ఎగురవేయాలని ఆయన నాయకులకు సూచించారు. టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.
W.G: ఉండి మండలం చెరుకువాడలో శనివారం ఇసుక టిప్పర్ లారీ పంటకాలువలో బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో కేవలం డ్రైవర్ మాత్రమే ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డాడని అతనికి ఎటువంటి గాయాలు కాలేదని స్థానికులు చెబుతున్నారు. ఆకివీడు వైపు నుంచి ఇసుక లోడ్‌తో ఉండి వైపు వెళుతూ లారీ బోల్తా కొట్టింది.
CTR: ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి శనివారం దర్శించుకున్నారు. పలువురు వైసీపీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి: రొద్దంలో మహిళలు, బాలికల భద్రతపై శనివారం పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి యాప్ వినియోగంపై వివరించారు. సైబర్ క్రైమ్‌లు, ఫ్రాడ్ లోన్స్ మోసాలు, బాల్య వివాహాల నివారణ, మహిళలు, పిల్లలపై జరిగే నేరాలపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రేణుక, కానిస్టేబుల్ పోతన్న, హుస్సేన్ భాష పాల్గొన్నారు.
KDP: మహాకవి పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పుట్టపర్తి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన మహానుభావుడని కొనియాడారు. ‘శివతాండవ కావ్యం’ వంటి అద్భుత రచనలతో తెలుగు సాహిత్యంలో అగ్రస్థానాన్ని సంపాదించారని పేర్కొన్నారు.
NDL: మహానంది మండలం అల్లినగరం ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థులకు భద్రతపై అవగాహన కల్పించారు. ఏఎస్పీ జావలి ఆదేశాల మేరకు శక్తి టీం సభ్యులు కార్యక్రమం నిర్వహించారు. ప్రతి విద్యార్థి తల్లి మొబైల్‌లో శక్తి యాప్ ఉండాలని హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ సూచించారు. సైబర్ నేరాలు, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు పాల్గొన్నారు.
ప్రకాశం: అర్ధవీడులోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఎస్సై శివ నాంచారయ్య శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న నెట్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లను స్వచ్ఛందంగా మూసివేయాలని సూచించారు. అలాగే, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని పేర్కొన్నారు.
BPT: రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు బాపట్ల పట్టణంలో పోలీసులు “నో హెల్మెట్-నో ఫ్యూయల్” కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు టౌన్ సీఐ రాంబాబు ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
W.G: ఆలూరు బస్టాండ్ సమీపంలో ఇవాళ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పంచాయతీ కార్యదర్శి జిలాన్ బాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని టీడీపీ ఇన్‌ఛార్జి వైకుంఠం జ్యోతి ప్రారంభించారు. వేసవిలో వేడి నేపథ్యంలో ప్రయాణికులు, స్థానికుల దాహార్తిని తీర్చేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు.
TPT: శ్రీ పుట్టపర్తి నారాయణ ఆచార్యుల జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆచార్యుల సేవలను స్మరించుకుంటూ, సమాజానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
CTR: పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలని HM లక్ష్మణ్ కుమార్ రెడ్డి కోరారు. పుంగనూరు పట్టణం లినార్ట్ మున్సిపల్ హైస్కూల్లో పారిశుద్ధ్య అధికారులు స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నియంత్రణ, తడి చెత్త, పొడి చెత్త అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు.
అనంతపురం నగరం సెకండ్ రోడ్డు పార్కులోని బీడీసీ సెంటర్ గ్రంథాలయాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వడ్డే వెంకట్ హామీ ఇచ్చారు. శనివారం ఆయన కేంద్రాన్ని సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏప్రిల్ 1 నుంచి గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల మెటీరియల్ అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు.
TPT: తడ మండలంలోని అనపగుట్ట, కావలి మిట్ట గిరిజన కాలనీల్లో కళాజాతర కార్యక్రమం నిర్వహించారు. పాటలు, నాటికల ద్వారా బాల్యవివాహాల దుష్ప్రభావాలను కళాకారులు వివరించారు. చిన్న వయస్సులో పెళ్లిళ్ల వల్ల ఆరోగ్య, విద్యాపరమైన నష్టాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
అల్లూరి: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఉచిత విద్య కోటా కింద లాటరీ పద్ధతిలో 39 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు శనివారం తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందన్నారు. ఎంపికైన విద్యార్థులు తమకు కేటాయించిన పాఠశాలల్లో ఏప్రిల్ 7వ తేదీ లోగా చేరాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కోనసీమ: పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి పురస్కరించుకుని శనివారం అమలాపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పుట్టపర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హాజరైన్నారు. పుట్టపర్తి నారాయణాచార్యులు తెలుగు సాహిత్యానికి చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.