VSP: రాష్ట్రవ్యాప్తంగా ఏపీసెట్-2025 ప్రవేశ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు 44 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 9,359 మంది దరఖాస్తు చేసుకోగా 7,617 మంది హాజరై 81.38% హాజరు నమోదైంది. ఆదివారం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్… సెట్ కోడ్‌ను విడుదల చేసారు.
VZM: జిల్లాలోని అక్రిడేటెడ్ జర్నలిస్టులకు సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక మెడికవర్ ఆసుపత్రిలో ఈ పరీక్షలు నిర్వహించారు. మొదటి రోజు 25 మంది జర్నలిస్టుల కుటుంబాలకు చెందిన 45 మందికి బీపీ, షుగర్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, 2డీ ఎకో తదితర పరీక్షలు నిర్వహించారు.
PPM: బిన్నిడి గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోందని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అన్నారు. శనివారం జరిగిన ‘గ్రామ ముస్తాబు’ ఉత్సవంలో పాల్గొన్న ఆయన, గ్రామస్థుల ఐకమత్యం, పరిశుభ్రత, పచ్చదనం, మలేరియా నివారణ చర్యలను ప్రశంసించారు. రైతులు లాభదాయక పంటలపై దృష్టి పెట్టాలని, జీడి మామిడి తోటలను శాస్త్రీయంగా పునరుజ్జీవనం చేసుకోవాలని సూచించారు.
CTR: ఏప్రిల్ 19న తిరుపతిలో నిర్వహించనున్న బీసీల ఆత్మీయ సదస్సును జయప్రదం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి షణ్ముగం శనివారం పిలుపునిచ్చారు. చిత్తూరులో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ సదస్సులో, బీసీల హక్కుల సాధనపై చర్చిస్తామన్నారు. వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తామన్నారు.
BPT: యద్దనపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలూరు గ్రామంలో జూదం జరుగుతోందన్న సమాచారంతో ఎస్సై సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.5,480 నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట, కోడి పందాలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
NTR: విస్సన్నపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా మండల కార్యదర్శి త్యాగరాజు అధ్యక్షతన జరగగా.. ముఖ్య అతిథి జిల్లా కార్యదర్శి శంకర్ పాల్గొని మాట్లాడారు. సీఎం చంద్రబాబు పల్లెల్లో 3, పట్నంలో 2 సెంట్లు స్థలాలు ఇస్తామని వాగ్దానం చేశారన్నారు. జాప్యం లేకుండా అర్హులైన పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ చేయాలన్నారు.
ELR: నూజివీడు పీఎసీఎస్ సభ్యులు మురళీకృష్ణ, భాస్కరరావు మరణించడంతో వారి కుటుంబ సభ్యులకు శనివారం పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. పీఎసీఎస్ అధ్యక్షులు పసుపులేటి జగన్ మాట్లాడుతూ.. కో-ఆపరేటివ్ సభ్యులు, రైతుల పురోభివృద్ధి ద్యేయంగా ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు. ఎల్లవేళలా సభ్యులకు అండగా ఉంటామన్నారు. సీఈవో నీలం నాగేశ్వరరావు పాల్గొన్నారు.
W.G: పెనుగొండ మండలం చినమల్లంలో రాజమండ్రి ఎన్.జీ. రంగ వ్యవసాయ కళాశాల విద్యార్థులు శనివారం పర్యటించారు. గ్రామీణ విశ్లేషణాత్మక కార్యక్రమంలో భాగంగా రైతుల సమస్యలను, పంట దిగుబడులను అడిగి తెలుసుకున్నారు. రసాయన పురుగుమందుల వాడకం తగ్గించి, సేంద్రీయ వ్యవసాయం చేపట్టడం వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు.
ATP: పుట్టపర్తి పప్పూరు నారాయణ ఆచార్యులు చేసిన సేవలు చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తాయని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో కీర్తిశేషులు నారాయణాచార్యులు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జెసి మాట్లాడుతూ.. వీరు జాతికి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేమన్నారు.
VSP: విశాఖలో పెళ్లి పేరుతో ఓ విద్యార్థినిపై లైంగిక దాడి చేసి, మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నెల్లూరుకు చెందిన రాహుల్ అనే వ్యక్తి తనపై దాడి చేసి, ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని బాధితురాలు పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించింది. బలవంతంగా గర్భస్రావం చేయించడమే కాకుండా ప్రాణహాని బెదిరింపులు చేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
NLR: జిల్లాలోని కలిగిరి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన చిన్నయ్య మార్కాపురం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకు రాగానే కుటుంబ సభ్యులు విలపించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కాకర్ల ట్రస్ట్ తరఫున అంత్యక్రియల కోసం ఆర్థిక సాయం అందజేసి, కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని పార్టీ నాయకులు తెలిపారు.
PLD: దళిత మహిళ కొనతం స్వాతికి న్యాయం చేయాలని కోరుతూ వైసీపీ ఎస్సీ సెల్ నాయకులు శనివారం సత్తెనపల్లి తాలూకా కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆందోళన చేపట్టారు. దళిత మహిళను కులం పేరుతో దూషించిన జనసేన నాయకుడు రంగిశెట్టి సుమన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
CTR: వీకోట మండలంలోని మిట్టూరుకు చెందిన వైసీపీ నాయకుడు మునిరత్నం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతదేహానికి జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే వెంకట గౌడ, ఎంపీపీ యువరాజ్ తదితరులు శనివారం నివాళులర్పించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని వెల్లడించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
NDL: సంజామల మండలం గిద్దలూరులో కోవెలకుంట్ల వ్యవసాయ మార్కెట్ యార్డు సెక్రటరీ నారాయణస్వామి, ఏడీ డా.కొండారెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని TDP నేత బత్తుల ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. ఈ శిబిరంలో పశువులకు చికిత్స, నట్టల నివారణ మందులు అందజేశారు. 486 పశువులకు FMD టీకాలు వేశారు.
KRNL: జిల్లా పోలీస్ శాఖ శనివారం ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా మెగా కార్డన్ సెర్చ్ నిర్వహించింది. 196 మంది పోలీసులు 350 మంది వ్యక్తులు, 77 వాహనాలు, 50 అనుమానితుల ఇళ్లను తనిఖీ చేశారు. పత్రాలు లేని 52 వాహనాలను స్వాధీనం చేసుకోగా, మంత్రాలయం పరిధిలో 41 లిక్కర్ బాటిళ్లు సీజ్ చేశారు. మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించడమే లక్ష్యమని వారు తెలిపారు.