CTR: పుట్టపర్తి నారాయణ ఆచార్యుల జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్థానిక కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ కలెక్టర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
విశాఖ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గాల్లో ఉండగానే ఇంజిన్ సమస్య వచ్చినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన పైలట్ అత్యవసరంగా ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని ఇండిగో సంస్థ తెలిపింది.
కృష్ణా: మచిలీపట్నం మండలం తాళ్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో శనివారం బాలికలకు వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగింది. ఈ సందర్భంగా వైద్యులు హిమబిందు, పద్మజ బాలికలకు హెచ్ పీవీ వ్యాక్సిన్లను వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బాలికల ఆరోగ్య రక్షణకు ఈ టీకా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. బాలికలు ఈ టీకాను తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు.
అనకాపల్లి: అచ్యుతాపురం మండలం మార్టూరు గ్రామానికి చెందిన 150 మంది వైసీపీ శ్రేణులు టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు సమక్షంలో శనివారం టీడీపీలోకి చేరారు. వారందరికీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన వారిలో సర్పంచ్ రమేష్ రాజు, మాజీ సర్పంచ్ సీతారామచంద్రరాజు, మాజీ ఎంపీటీసీ గుర్రం అప్పారావు ఉన్నారు.
విజయనగరం: శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు జీవితం నేటి యువతకు ఆదర్శమని, బహుభాషలలో ప్రావీణ్యం సంపాదించిన యువతకు అవకాశాలు మెండుగా ఉంటాయని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ తెలిపారు. ఆయన జయంతిని పురస్కరించుకొని శనివారం కలక్టరేట్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జేసీ పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగు సాహితీ రంగానికి చేసిన కృషి అమోఘమమన్నారు.
ప్రకాశం: వెలిగండ్ల మండలం మరపగుంట్ల సచివాలయంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 75% సబ్సిడీపై గడ్డి జొన్నలను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సూచనల మేరకు మండలంలోని ప్రతి సచివాలయానికి ఒక టన్ను గడ్డి జొన్నలు మంజూరు చేసినట్లు తెలిపారు.
GNTR: గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాలను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా శనివారం పరిశీలించారు. మస్తాన్ దర్గా వెనుక ఉన్న గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాన్ని, ఏటి అగ్రహారం 13వ లైన్‌లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలను సీఎస్ఆర్ నిధులతో ఆధునికరించడం జరిగింది. పలు హాస్టల్‌ను కలెక్టర్ పరిశీలించారు.
కడప నగరంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో YSRTUC ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు జాషువా, నగర అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణతో పాటు కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా CEC సభ్యులు కె. సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా, మాజీ మేయర్ పాక సురేష్ కుమార్, తదితరులు హాజరయ్యారు.
ELR: వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముళ్లగిరి ఇమ్మానుయేల్ మరణం పార్టీకి తీరని లోటని చింతలపూడి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి కంభం విజయరాజు అన్నారు. శనివారం ఇమ్మానుయేల్ భౌతిక కాయానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే వైసీపీ పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ధర్మవరం నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జ్ హరీష్ బాబు పట్టణంలోని గ్యాస్ ఏజెన్సీలను సందర్శించారు. పట్టణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్ కొరత రాకుండా చూడాలని యజమానులకు సూచించారు. అవసరమైతే మంత్రి స్వయంగా అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు.
NDL: కోయిలకుంట్ల మండలం గుల్లదుర్తి గ్రామంలో ఉన్న బీసీ సంక్షేమ హాస్టల్ వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని ఇవాళ సీపీఎం నాయకుడు సుధాకర్ డిమాండ్ చేశారు. బీసీ హాస్టల్లో ఉన్న విద్యార్థుల పట్ల వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇతనిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.
ATP: పామిడి పోలీస్ స్టేషన్‌లో శనివారం నూతన ఎస్సైగా రాఘవేంద్రప్ప బాధ్యతలు స్వీకరించారు. ముందుగా స్టేషన్ సిబ్బంది నూతన ఎస్సైకి స్వాగతం పలికారు. ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పోలీసు సిబ్బంది నూతన ఎస్సైకి శుభాకాంక్షలు తెలిపారు.
TPT: స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడిన కలెక్టర్ పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
NLR: నియోజవర్గంలోని కోవూరు బుచ్చిరెడ్డిపాలెం, కొడవలూరు మండలంలో రేపు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. ఆయా మండలాల్లో టీడీపీ 44 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని కార్యాలయ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. నియోజవర్గంలోని కూటమి నాయకులు పాల్గొనాలని కోరారు.
E.G: కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, ఏపీ రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేఎస్ జవహర్ శనివారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ మెంబర్ శ్రీపతి బాబు ఉన్నారు.