సత్యసాయి: హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో శనివారం జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా పర్యటించారు. ఎం.జి.ఎం మైదానంలో పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లు పంపిణీ చేసి, కొత్త గార్బేజ్ ఈ-ఆటోలను ప్రారంభించారు. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న వ్యాపారులపై జరిమానా విధించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.