Anam Ramanarayana Reddy : టీడీపీలో చేరతారా..? ఆనం సమాధానం ఇదే..!
Anam Ramanarayana Reddy : ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ మారతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ విషయంపై ఆయన తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనను పార్టీ సస్పెండ్ చేయడంపై కూడా ఆయన స్పందించారు.
పార్టీ నుంచి సస్పెండ్ కాగానే రాజకీయంగా అయితే స్వేచ్ఛగా అనిపిస్తోందన్నారు ఎమ్మెల్యే ఆనం. కానీ నిరాదారమై న ఆరోపణలతో తను బయటకు పంపేందుకు చేసిన ప్రయత్నం బాధ అనిపించిందని కామెంట్స్ చేశారు . ఇక, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు అయ్యిందని.. నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా చేశాను అన్నారు.
తాను జగన్ కూడా వైఎస్సార్‌లా ఉంటాడని భావించానని.. పాలన కూడా అలాగే ఉంటుందని అనుకున్నాను అన్నారు. వైఎస్ అందరితో సాన్నిహిత్యంతో ఉంటారని.. ఈయనా ఉంటారని భావించినా.. అది లిమిటెడ్ మాత్రమే అన్నారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు సీక్రెట్ బ్యాలెట్ పద్దతిన జరిగిందని.. తాము వేరేవారికి ఓటు వేశామని చెప్పడానికి వీళ్లెవరని ప్రశ్నించారు. వీరికి అధికారులెవరైనా సమాచారం ఇచ్చారా అని ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తాను అన్నారు. ఒకవేళ అధికారులు అలా సమాచారం ఇస్తే వారిపై చర్యలు తీసుకోవాలని.. ఎన్నిక తర్వాత రీ వెరిఫికేషన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాని.. తాము ముడుపులు తీసుకున్నారు అన్న ఆరోపణ మీద కోర్టులో పరువు నష్టం దావా వేస్తాను అన్నారు.
ఇక టీడీపీలో చేరే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. త్వరలోనే తన అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని… త్వరలోనే తన భవిష్యత్తు కార్యచరణ ఏంటో తెలియజేస్తానని ఆయన తెలిపారు.