»Machilipatnam Cm Jagan Speech In Bandar Port Laid Foundation Stone Ceremony
Bandar Portతో కృష్ణా జిల్లా చరిత్ర మారబోతున్నది: సీఎం జగన్
ఈ పోర్టు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు.. ఆటంకాలు సృష్టించారు. అమరావతిలో తాను కొన్న భూములు ధరలు పెరుగుతాయని భావించి మచిలీపట్నానికి చంద్రబాబు తీవ్ర ద్రోహం చేశారు. కానీ ఇప్పుడు ఆ గ్రహణాలన్నీ తొలగిపోయాయి.
బందరు పోర్టు (Bandar Port) నిర్మాణంతో కృష్ణా జిల్లా (Krishna District) చరిత్ర మారబోతున్నదని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) తెలిపారు. ఈ పోర్టు రాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అడ్డుకున్నారని విమర్శించారు. అనేక ఆటంకాలు సృష్టించారని మండిపడ్డారు. కానీ అన్ని సమస్యలు అధిగమించి పోర్టు నిర్మాణం చేపట్టినట్లు సీఎం జగన్ వెల్లడించారు.
మచిలీపట్నంలో (Machilipatnam) బందర్ పోర్టు నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం జగన్ అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘వందల ఏళ్లు గడుస్తున్నా పోర్టు నిర్మాణాన్ని ఎవరూ పట్టించుకోలేదు. బందరుకు సముద్ర వర్తకంలో (Sea Trade) వందల ఏళ్ల చరిత్ర ఉంది. బందరువాసుల కలను నెరవేర్చాం. పోర్టు చిరకాల స్వప్నం సాకారమవడంతో కృష్ణా జిల్లా చరిత్ర మార్చబోతుంది. ఈ పోర్టు నిర్మాణానికి గ్రహాలు తొలగిపోయాయి’ అని సీఎం జగన్ తెలిపారు. ‘ఈ పోర్టు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు.. ఆటంకాలు సృష్టించారు. అమరావతిలో (Amaravati) తాను కొన్న భూములు ధరలు పెరుగుతాయని భావించి మచిలీపట్నానికి చంద్రబాబు తీవ్ర ద్రోహం చేశారు. కానీ ఇప్పుడు ఆ గ్రహణాలన్నీ తొలగిపోయాయి. మరో 24 నెలల్లోనే బందరు రూపురేఖలు మారుతాయి’ అని చెప్పారు.
‘టీడీపీకి (TDP) గజదొంగల ముఠా తోడైంది. ఈ ముఠా సభ్యులు ఈనాడు. ఆంధ్రజ్యోతి, టీవీ-5, ఓ దత్తపుత్రుడు. వీళ్ల పని దోచుకోవడం, దాచుకోవడం, తినుకోవడం. పేదలకు ప్రవేశం లేని గేట్ వే కమ్యూనిటీని ప్రభుత్వ సొమ్ముతో కట్టుకోవాలని చూశారు. బినామీల పేరుతో లక్షల కోట్లు గడించాలని చూశారు. లంచాలు, వివక్ష లేకుండా నేరుగా పథకాలు (Schemes) అందుతున్నాయి. దేవుడి యజ్ణాన్ని రాక్షసులు అడ్డుకున్నారు. మీ బిడ్డ ప్రజలనే నమ్ముకున్నాడు. మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలవండి. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే. ఆయనకు మానవత్వమే (Humanity) లేకుండాపోయింది. పేదల ఇళ్లను దారుణంగా అడ్డుకుంటున్న ద్రోహి బాబు. ఆయన పేదలకు సెంటు భూమి (Land) కూడా ఇవ్వలేదు’ అని జగన్ పేర్కొన్నారు.