KRNL: ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి చేస్తున్న డైవర్షన్ రాజకీయాలు తన దగ్గర సాగవని మాజీ MLA సాయిప్రసాద్ రెడ్డి అన్నారు. సర్వే నంబర్ 630లో తన అనుచరులు కబ్జా చేశారంటే వారి పేర్లు బయటపెట్టాలని సవాల్ విసిరారు. MLA తనపై ఆరోపణలు చేయడం మానేసి ఆదోని మెడికల్ కాలేజీ, ఈద్గా నిధులు, ఐటీఐ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. త్వరలోనే MLA బాగోతం బయటపెడతానన్నారు.