VZM: గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. భవానీపట్నం నుంచి విశాఖ వెళ్లే రద్దీ రైలులో ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలతో ‘కార్డాన్ సెర్చ్’ నిర్వహించారు. ఈ మేరకు బాంబ్, డాగ్ స్క్వాడ్లతో ప్రయాణికుల బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎవరికీ అసౌకర్యం కలగకుండా ఈ సోదాలు జరిగాయి. అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యమని ఎస్పీ స్పష్టం చేశారు.