TPT: తిరుపతి ప్రధాన స్టేషన్లో రద్దీ తగ్గించేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అరక్కోణం, చెన్నై సెంట్రల్ మెమూ రైళ్లు ఇకపై తిరుపతికి రావు. తిరుచానూరు రైల్వే స్టేషన్ నుంచే ఇవి రాకపోకలు సాగించనున్నాయి. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇకపై తిరుపతి బదులు తిరుచానూరు స్టేషన్కు వెళ్లాల్సి ఉంటుంది.