PPM: కొమరాడ మండలంలో పలు గ్రామాలలో ఇవాళ సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ వర్షం కూరగాయలు, వాణిజ్య పంటలకు ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు చెబుతున్నారు. అంతేకాకుండా ఖరీఫ్ సీజన్లో రైతులు పంటలు వేసుకునేందుకు పంట పొలాలు దున్నేందుకుగాను ఈ వర్షం ఉపయోగపడుతుందన్నారు.