GNTR: తెనాలి పురపాలక సంఘ మెప్మా విభాగం ఆధ్వర్యంలో పాత రత్న టాకీస్ సమీపంలోని రైతు బజార్ ఎదుట ఏర్పాటు చేసిన ‘తృప్తి’ క్యాంటీన్ గురువారం ప్రారంభం కానుంది. మున్సిపల్ ఛైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ రామ అప్పల నాయుడు ఈ క్యాంటీన్‌ను ప్రారంభించనున్నారు. మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది.