VSP: వేసవిని దృష్టిలో ఉంచుకుని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పీ. విష్ణుకుమార్ రాజు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా GVMC జోన్-5 కార్యాలయంలో ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా పునర్వినియోగం చేయగల నీటి బాటిళ్లను అధికారులకు మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమార్తె శ్యామల దీపిక, తదితరులు పాల్గొన్నారు.