VSP: సుమారు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత విశాఖ ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలలో నల్ల చిరుత (బ్లాక్ పాంథర్) సందడి మొదలైంది. మంగళవారం దీనిని అధికారికంగా ఎన్‌క్లోజర్‌లోకి విడిచిపెట్టగా… తొలిరోజు బిక్కుబిక్కుమంటూ గడిపింది. బుధవారం మాత్రం తన స్టైల్లో గర్జన చేస్తూ ఎన్‌క్లోజర్ మొత్తం పరుగులు తీసింది.