SKLM: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను అధికారులు అత్యంత ప్రాధాన్యతతో, నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. బాధితుల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం వహించ రాదని అన్నారు.