CTR: పలమనేరు నుంచి మహదేవ మంగళం మార్గంలో లైన్ల మరమ్మతుల కారణంగా గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్కో సబ్ డివిజన్ అధికారి సురేష్ తెలిపారు. పలమనేరు, బైరెడ్డిపల్లి, కుప్పం మండలాల పరిధిలో ఈరోజు నుంచి 9వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరఫరా ఉండదన్నారు.