KDP: జమ్మలమడుగు (M) దేవగుడిలో గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతకు స్వయం సహాయక సంఘాల సభ్యులకు పెరటి కోళ్లు పంపిణీని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసన సభ్యులు ఆదినారాయణరెడ్డి, కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు యూనిట్లను అందజేశారు. ఒక్క యూనిట్ విలువ రూ.3,700 కాగా, ప్రతి యూనిట్లో ఏడు పెట్టలు, మూడు పుంజులు ఇచ్చారు.