KKD: గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో గోవులు రోడ్లపై స్వైరవిహారం చేస్తున్నాయని వాహనదారులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. యజమానులు నిర్లక్ష్యంగా పశువులను వదిలేయడంతో ప్రధాన రహదారులపై ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో వీటి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.