KRNL: జిల్లా పోలీసు శాఖలో విశిష్ఠ సేవలు అందించిన 27 మంది అధికారులు, సిబ్బందికి 2025 సంవత్సరానికి గాను ఉత్కృష్ట సేవా పతకం, అతి ఉత్కృష్ట సేవా పతకాలకు ఎంపిక చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. స్మార్ట్ పోలీసింగ్‌తో పాటు వివిధ సేవల్లో ప్రతిభ చూపినందుకు పురస్కారాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో వీరికి పురస్కారాలు అందజేస్తున్నట్లు తెలిపారు.