E.G: నిరుద్యోగ రహిత రాజమండ్రిని నిర్మించడమే తమ లక్ష్యం అని రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ పేర్కొన్నారు. ఏప్రిల్ 18వ తేదీన రాజమండ్రిలోని మార్గాని ఎస్టేట్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జాబ్ మేళాలో 1000 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, బీఫార్మసీ, బీటెక్, ఎంబీఏ, పీజీ చదివినవారు అర్హులన్నారు.