శ్రీకాకుళం నగరం వాంబేకాలనీకి చెందిన పైల మోహనరావు (48) దారుణ హత్యకు గురయ్యాడు. ఎచ్చెర్ల మండలం పొన్నా వంతెన సమీపంలో గురువారం సాయంత్రం స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు టిఫిన్, కిరాణా షాపులను నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యుల సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.