GNTR: సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ), శ్రీ కనకదుర్గ ఆలయం అర్చకులు సీఎంకు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి ప్రసాదాలు, చిత్రపటాలను ఆయనకు అందజేశారు.