KDP: రాజంపేటలో నిర్వహించిన శక్తి యాప్ అవగాహన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పాల్గొన్నారు. మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి యాప్ ఎంతో ఉపయోగకరమని తెలిపారు. మొబైల్ ఫోన్ కేవలం వినోదానికి మాత్రమే కాకుండా రక్షణకు కూడా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పోలీసుల సూచనలు పాటిస్తూ యాప్ను వినియోగించుకోవాలని మహిళలకు సూచించారు.