CTR: విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని విద్యాశాఖ అధికారులకు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి సూచించారు. డీఈవో రాజేంద్రప్రసాద్, మండల విద్యాశాఖ అధికారులతో తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలన్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికా బద్ధంగా పనిచేయాలని కోరారు. తల్లితండ్రులకు అవగాహన కల్పించాలన్నారు.