SDPT: కొండపాక మండల కేంద్రంలోని 5వ వార్డు పెద్దమ్మ గుడి వద్ద అండర్ గ్రౌండ్ మోరీ పనులను జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంచాల నవీన శ్రీనివాస్ గౌడ్ పాల్గొని పనులను ప్రారంభించారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడటం వల్ల దోమల బెడద తప్పుతుందని, గ్రామాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.