MBNR: మహిళా రిజర్వేషన్లపై సమ్మిళిత తాత్త్విక దృక్పథం లోపించిందని పాలమూరు వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగం కుమార స్వామి అన్నారు. మహిళా సాధికారతకు కేవలం రిజర్వేషన్లు మాత్రమే సరిపోవని, విద్య, ఉపాధి వంటి రంగాల్లోనూ సమగ్ర విధానాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. నిర్ణయాత్మక శక్తిగా మహిళలు ఎదగాలంటే సామాజిక మార్పు అత్యవసరమని అభిప్రాయపడ్డారు.