SS: తలుపుల మండలం లక్కసముద్రం గ్రామంలో రూ. 80 లక్షల నాబార్డు నిధులతో నిర్మించిన రోడ్డును MLA కందికుంట వెంకట ప్రసాద్ గురువారం ప్రారంభించారు. అనంతరం స్థానిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థులతో విద్యాబోధన, భోజన నాణ్యతపై చర్చించారు. గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.