W.G: తాడేపల్లిగూడెం యాగర్లపల్లి చెందిన గోంగడి లక్ష్మణ్ (23) కనిపించడం లేదంటూ పట్టణ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆయన మృతదేహం ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద గోదావరి ఏలూరు కాలువలో లభ్యమయింది. సంఘటన స్థలాన్ని ఇవాళ తాడేపల్లిగూడెం పట్టణ ఎస్సై నాగరాజు పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.