NDL: గోస్పాడు మండలం పసురపాడు సచివాలయాన్ని మంగళవారం కలెక్టర్ రాజకుమారి ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో విధులకు పంచాయతీ సెక్రటరీ విజయ భాస్కర్ రెడ్డి మద్యం తాగి హాజరైనట్లు గమనించిన కలెక్టర్.. వెంటనే పోలీసులతో బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో 100 MLకు 65 ఎంజీ ఆల్కహాల్ స్థాయి నమోదైంది. దీంతో తక్షణమే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.