PPM: గుమ్మలక్ష్మి పురం మండలంలోని లక్కగూడ గ్రామంలో నిర్మాణంలో ఉన్న పెర్కోలేషన్ ట్యాంక్ (భూగర్భ జల రీఛార్జ్ కుంట) పనులను జిల్లా జాయింట్ కలెక్టర్ సీ.యశ్వంత్ కుమార్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పనుల నాణ్యతను స్వయంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాణ్యతలో రాజీ పడకూడదన్నారు.