PPM: గుమ్మలక్ష్మీపురంలో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి బి. అనిల్ మాట్లాడుతూ 2026 ఐపీఎల్ సీజన్ ప్రారంభంతో యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని తెలిపారు. క్రికెట్‌ను ఆస్వాదించడమే కాకుండా కొంతమంది బెట్టింగ్‌లకు పాల్పడి డబ్బులు కోల్పోతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.