TG: గురుకుల విద్యాలయాల సంస్థ, కేజీబీవీల్లో ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు నిర్వహించే TGRJC సెట్ దరఖాస్తుల గడువు ఇవాళ్టితో ముగియనుందని ఆ సంస్థ కార్యదర్శి రమణకుమార్ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 60 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఆసక్తి గల వారు ఇవాళ సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.