E G: కొవ్వూరు మండలం కుమారదేవం ఇసుక ర్యాంపు వద్ద గోదావరి నదిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం కొట్టుకువచ్చింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు సుమారు 30–35 ఏళ్ల వయస్సు గలవాడిగా భావిస్తున్నారు. బ్లాక్ అండ్ బ్లూ టీషర్ట్, బ్లాక్ షార్ట్ ధరించి ఉన్నాడు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.