SS: చెన్నేకొత్తపల్లి మండలంలో ఉన్న బాబా భారత్ గ్యాస్ కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యాస్ సరఫరా విధానం, నిల్వలు, రికార్డులు వినియోగదారులకు అందిస్తున్న సేవలను జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా నిబంధనల ప్రకారం గ్యాస్ పంపిణీ నిర్వహించాలని, వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.