SRD: యుద్ధం వద్దు – శాంతి ముద్దు ఈ నినాదమే హద్దుగా పెట్టుకోవాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే రాజయ్య అన్నారు. బీరంగూడ మంజీరా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో డాక్టర్ పెంటయ్య, ఇష్ట విద్యా సంస్థల ఛైర్మన్ కార్తీక్, తదితరులు ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాల యుద్ధంపై ప్రసంగించారు. ప్రపంచశాంతికై అందరు ప్రయత్నం చేయాలని అన్నారు.