CTR: చిత్తూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారి టి. సాయినాథ్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు తనిఖీ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 7 మందిని ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరచగా ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.70 వేల జరిమానా విధించారు. ఇద్దరికి జరిమానాతో పాటు ఒక రోజు సాధారణ శిక్ష విధించారు.