విశాఖ నగరంలో పారిశుద్ధ్య పనులు, పచ్చదనం అభివృద్ధిని మరింత మెరుగుపరచాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఈస్ట్, సౌత్, పెందుర్తి జోన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వ్యర్థాల సేకరణ, తరలింపుపై అధికారులను ప్రశ్నించారు. ఇంటింటి చెత్త సేకరణ 100% జరగాలని సూచించారు.