NTR: కంచికచర్ల(M) కీసర గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ, పోతురాజు స్వామి ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. అర్చకుడు రాము శర్మ పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగి పసుపు, కుంకుమ సమర్పించారు. వర్షాలు కురవాలని, పంటలు పండాలని ప్రార్థించారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నదానం ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.