NLR: CM చంద్రబాబు వింజమూరులో ‘పేదల సేవ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఎస్సీ కాలనీలో లబ్ధిదారు యరగొర్ల బాలమ్మ ఇంటికి వెళ్లి వితంతు పింఛను అందించారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. తన చిన్న కుమారుడు బాలరాజు కాలేయ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని బాలమ్మ సీఎం దృష్టికి తీసుకొచ్చారు.