కడప: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామయ్య కళ్యాణోత్సవం బుధవారం సాయంత్రం 6:30 గంటలకు అంగరంగ వైభవంగా జరిగింది. సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు 6వ సారి స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. సీఎం దంపతులు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. పండు వెన్నెల్లో సుమారు 55వేల మందికిపైగా భక్తులు కళ్యాణాన్ని తిలకించారు.