MNCL: మందమర్రి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్ పర్సన్ పరోక్ష ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ చంద్రయ్య అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 4న జరగనున్న ఈ ఎన్నికల దృష్ట్యా మున్సిపల్ కార్యాలయంలోని ఎన్నికల వేదికలను ఆయన పరిశీలించారు. నిబంధనల ప్రకారం శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.