TG: కొండలు, గుహలు, లోయలు, బండరాళ్లను దాటుకుంటూ ట్రెక్కింగ్ చేస్తూ భక్తులు లింగమయ్యను దర్శించుకుంటున్నారు. నాగర్కర్నూల్ జిల్లా లోతట్టు నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన సలేశ్వర క్షేత్రం మరో అమర్నాథ్ను తలపిస్తోంది. సుమారు 500 అడుగుల ఎత్తైన కొండ పైనుంచి లోయలోకి జారిపడుతున్న జలపాతం, చుట్టూ కొండలు, ప్రకృతి రమణీయత మధ్య ఆహ్లాదకర వాతావరణంతో యాత్ర సాగుతోంది.