E.G: రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తి పన్ను వసూళ్లలో రికార్డు సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 82.41 శాతం పన్నులు వసూలైనట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. చివరి రోజైన మంగళవారం ఒక్కరోజే రూ.5.12 కోట్లు వసూలయ్యాయి. ప్రస్తుత ఏడాది ఆస్తి, ఖాళీ స్థల పన్నుల రూపంలో మొత్తం రూ.78.72 కోట్లు సమకూరినట్లు ఆయన వివరించారు.