నంద్యాల: నందికొట్కూరు మండలం అల్లూరులోని కేసీ కెనాల్లో గుర్తుతెలియని శవం లభ్యమైందని బ్రాహ్మణకొట్కూరు ఎస్సై మణికంఠ బుధవారం తెలిపారు. సుమారు 40 ఏళ్ల వయస్సు గల పురుషుడిగా గుర్తించారు. మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం కోసం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.