E.G: రంగంపేట ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్లో వివిధ ఎక్సైజ్ నేరాలతో పట్టుబడిన మూడు ద్విచక్ర వాహనాలకు గురువారం ఎక్సైజ్ స్టేషన్లో బహిరంగ వేలం నిర్వహిస్తున్నామని ఎక్సైజ్ సీఐ డి.సుధ ఒక ప్రకటనలో తెలిపారు. రాజమండ్రి ఆర్టీవో నిర్ణయించిన ధరపై వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కావున ఆసక్తి గలవారు వేలం పాటలో పాల్గొనాలని సూచించారు.