KMM: భార్యను చంపిన భర్తకు ఏడేళ్ల జైలుశిక్ష రూ 5 వేలు జరిమానా విధిస్తూ 4వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి అర్చన తీర్పు వెల్లడించారు. వివరాల్లోకెళ్తే మధ్యప్రదేశ్‌కి చెందిన నిందితుడు కమలేష్ మరావి అతని భార్య పింకీ మాధవి (38) మిర్చికోత పనులకు కారేపల్లి వచ్చారు. ఓ విషయంలో కమలేష్ భార్యను విపరీతంగా కొట్టడంతో మృతి చెందింది. ఈ ఘటనలో నేరం రుజువు కావడంతో అతడికి శిక్ష ఖరారు చేశారు.