AP: రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు నిన్న లోక్సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బిల్లు ఇవాళ రాజ్యసభకు రానుంది. నిన్న చర్చించిన మాదిరిగానే ఆయా పార్టీల సభ్యులు ఇవాళ కూడా ఈ బిల్లుపై దాదాపు గంట పాటు చర్చించనున్నారు. కాగా ఈ బిల్లు రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడేలా లేదని, అందుకనే దీన్ని వ్యతిరేకిస్తున్నామంటూ నిన్న సభ నుంచి YCP వాకౌట్ చేసింది.